ETV Bharat / state

గురువారం తిరుమలకు సీఎం చంద్రబాబు - ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ - CM CHANDRABABU ON TIRUPATI STAMPEDE

గురువారం ఉదయం తిరుపతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు - మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని వెల్లడి

CM_CHANDRABABU_ON_TIRUPATI
CM_CHANDRABABU_ON_TIRUPATI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 14 hours ago

Tomorrow CM Chandrababu going to Tirupati : తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమీక్షించారు. ఘటనపై ఆరా తీశారు. ఈ క్రమంలో సీఎం గురువారం ఉదయం తిరుపతి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

కొందరు అధికారుల వల్ల ఈ ఘటన జరిగిందని, ఆరుగురు చనిపోయారని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక మహిళకు ఆరోగ్యం బాగాలేదని గేటు తీసేటప్పుడు తోపులాట జరిగిందని అన్నారు.

వైకుంఠద్వార టోకెన్ల జారీలో అపశ్రుతి - ఆరుగురు మృతి

ముక్కోటి ఏకాదశి - ముస్తాబవుతున్న ద్వారకా తిరుమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.