నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీ - నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ న్యూస్
నరసరావుపేటలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ర్యాలీ కొనసాగుతోంది. ర్యాలీతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఈ ర్యాలీకి తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం నుంచి చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఉద్యమం కోసం తెదేపా అధినేత, ఐకాస నేతలు జోలె పట్టారు. ర్యాలీ అనంతరం పల్నాడు బస్టాండు వద్ద బహిరంగసభ జరగనుంది.