కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకు నిరసనగా ఆందోళన చేపట్టారు. సుబ్బయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాలనలో రోజురోజుకు దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అధికార పార్టీ అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు లింగారెడ్డి, అమీర్ బాబు, వెంకటసుబ్బారెడ్డి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: