కడప జిల్లాలో ఇటీవల మరణించిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ అన్భురాజన్ పోలీస్ సంక్షేమ నిధి నుంచి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అనంతరం పోలీస్ కుటుంబాల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి