కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. కరోనా వైద్యానికి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్పై చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కడప జిల్లా కేంద్రంలోని రెండు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్స అందించాలని ఎస్పీ తెలిపారు. ఏ ఆస్పత్రిలో అయినా అధిక ఫీజులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా విపత్కర సమయంలో సేవ చేయాల్సిన బాధ్యతను వైద్యులకు గుర్తు చేశారు.
ఇదీ చదవండి: 'శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతి'