ETV Bharat / state

శివశంకర్ రెడ్డి మరో ప్రయత్నం.. సోమవారం సీబీఐ కూడా..! - Shiv Shankar Reddy

viveka murder case: వివేకా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై సీబీఐ సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

viveka murder case:
viveka murder case:
author img

By

Published : Feb 19, 2022, 7:47 PM IST

viveka murder case: బెయిల్ కోసం వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి మరో ప్రయత్నం చేశారు. ఈ మేరకు కడప కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీబీఐ.. సోమవారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనుంది. వివేహ హత్య కేసులో శివశంకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

విచారణ ముమ్మరం..
మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా... వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను... సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో.. వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

కోర్టు అనుమతి..
వివేకా హత్య కేసులో.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడానికి కడప సబ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని.. 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. దస్తగిరిని అప్రూవర్​గా మారేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు మరోసారి దస్తగిరి నుంచి 164 సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

ఇదీ చదవండి:

Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.