కడప నగరంలోని పుష్పగిరి పాఠశాలలో బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. సమయానికి బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను పాఠశాలకు తరలించి బస్సు పార్కింగ్ చేశారు. ఒక్కసారిగా బస్సులో నుంచి మంటలు రావడంతో అక్కడున్న పాఠశాల సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆరు లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.
ఇదీ చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం'