కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో పతంగే రామన్నరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం చెరువును తలపిస్తోంది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో మైదానం ఉంది. అధికారులు నిర్వహణ లోపంతో విద్యార్థులకు ఆ మైదానం ఉపయోగపడటం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇదే ఆవరణలో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించారు. కరోనా వైరస్ కారణంగా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.. విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చూడండి