Awareness of cyber crime: కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే వైఎస్ఆర్ బీమా సొమ్మును అందజేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ ముఠా సభ్యులను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ రాకెట్ నిర్వహిస్తున్న నలుగురు ముఠా సభ్యులను ఇవాళ కడప పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరి వద్ద 73 సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు, నాలుగు లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని అదనపు ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ లింక్‌లను చూసి మోసపోవద్దని ఏఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: