కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బాధితులు, నిందితులతో నేర వాతావరణంలో ఉండే పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా పండగ వాతావరణం దర్శనమిచ్చింది. పోలీసులు కుటుంబాలతో కలిసి ఒకేచోట చేరి సందడి చేశారు. పోలీసులు పంచె కట్టుతో అలరించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, లెమన్ స్పూన్, తాడాట, కుర్చీలాట పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి, పట్టణ సీఐ శుభ కుమార్, ఎస్ఐ ప్రతాపరెడ్డి బహుమతులు అందజేశారు.
ఇవీ చూడండి...