ETV Bharat / state

ఇసుక కావాలని బుక్​చేస్తే మట్టిని పంపారు..! - rajampeta mandal latest sand news

తన ఇంటి నిర్మాణం కోసం కూచివారిపల్లె పంచాయతీ పరిధి ఎస్వీనగర్​లో 18 టన్నుల ఇసుకను చంద్రశేఖర్​ అనే వ్యక్తి ఆన్​లైన్​లో బుక్​ చేశారు. అతనికి కిచ్చమాంబాపురం క్వారీ నుంచి మట్టితో ఉన్న ఇసుకను పంపారు.

sand with mud caught in rajampeta mandal after booked in online in kadapa district
ఇసుకలో కల్తి
author img

By

Published : Jun 26, 2020, 7:10 AM IST

ఆన్​లైన్​లో ఇసుక కావాలని బుక్ చేసుకుంటే మట్టి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది. కూచివారిపల్లె పంచాయతీ పరిధిలోని ఎస్వీ నగర్​కు చెందిన నాగినేని చంద్రశేఖర్ అనే వ్యక్తి... ఇంటి నిర్మాణం కోసం 18 టన్నుల ఇసుక కావాలంటూ రూ.9,322 అన్​లైన్​లో డబ్బులు చెల్లించాడు. కిచ్చమాంబాపురం క్వారీ నుంచి అతనికి లోడు పంపారు. కానీ అందులో మట్టి ఇసుక ఉంది. గుర్తించిన చంద్రశేఖర్ బంధువు తమకు ఈ ఇసుక వద్దంటూ టిప్పర్​ను వెనక్కి పంపించేశారు.

ఇదీ చదవండి :

స్థానిక వాగుల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.