కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు నాటుసారా స్థావరాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఆరు వందల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశారు. వీరబల్లి, బద్వేల్, సుండుపల్లి, తదితర ప్రాంతాలలో దాడులు చేపట్టారు.
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపైనా దాడులు చేశారు. 60 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: