లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అధికారులకు సూచించారు. కడప జిల్లా కమలాపురం ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కట్టడిపై సమీక్షించిన ఆయన.. పోలీసు, వైద్య సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రతి మండలంలో హైపో ద్రావణాన్ని పిచికారి చేయించాలని చెప్పారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ఇదీ చూడండి: