కడప జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య జలాశయం నుంచి చెయ్యేరు నదిలోకి ప్రాజెక్ట్ అధికారి సీతారామయ్య నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోని మూడో గేట్ నుంచి 400 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. నదీ తీర ప్రాంతాలైన రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి సూచన మేరకు అన్నమయ్య జలాశయ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1.14 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి ప్రధాన వార్తలు@9PM