కడప జిల్లా రైల్వేకోడూరు మండలం సూరపురాజుపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు రైల్వే బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు టెంపో వాహనంలో తరలిస్తున్న 4 దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని అబ్బిరాజుగారిపల్లికి చెందిన స్మగ్లర్ నాగేశ్వరరాజును అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ. 2 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి..