తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ సెట్ పరీక్షా ఫలితాల్లో... కడప జిల్లా ప్రొద్దుటూరు విద్యార్థులు సత్తా చాటారు. పట్టణంలోని వేదవ్యాస డిగ్రీ కళాశాలకు చెందిన అనోహన్.. ఎంఎస్సీ మ్యాథ్స్‌లో 40వ ర్యాంకు, ఎంఎస్సీ ఫిజిక్స్‌లో హసీనా 58వ ర్యాంకు, అఖిల లక్ష్మి 135వ ర్యాంకు, వినయ్‌కుమార్ 254వ ర్యాంకు, దినేష్ 396వ ర్యాంకు, నాగేష్ 568వ ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సహకారంతోనే ఉత్తమ ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారిని కళాశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు అభినందించారు.
ఇదీచదవండి.