జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని లాడ్జీలు, సుందరయ్య కాలనీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కొత్త వ్యక్తుల గురించి వాకబు చేయడంతోపాటు... రికార్డు లేని వాహనాల పత్రాలను పరిశీలించారు. డీఎస్పీ స్వయంగా సుందరయ్య కాలనీలో ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేశారు. కాలనీవాసులను డీఎస్పీ ఒక చోట సమావేశపరిచి ప్రతి ఒక్కరు మంచి నడవడికతో ఉండాలని సూచించారు. కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: