కడప జిల్లా రైల్వేకోడూరులో రోజురోజుకు కరోనా ఉద్దృతి పెరుగుతుండడంతో పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. కళాకారుల చేత యమభటులు వేషధారణలతో వీధి వీధినా కరోనా వైరస్ పై ప్రజలకు సూచనలు చేయించారు. అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని తెలిపారు. బయటకు వచ్చేవారు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా కరోనా నిబంధనలు పాటించాలని రైల్వే కోడూరు ప్రజలకు పోలీసులు సూచించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరవాలని తెలిపారు. ప్రజలెవరూ దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా ఉండరాదు అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు కరోనా నియమాలు పాటించకుంటే వారిపైన కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అన్నారు. కార్యక్రమంలో యమదూత వేషధారణతో అదునుకోట నరసింహులు వారి బృందం పాల్గొని కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
ఇదీ చదవండీ.. 'ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే.. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ'