ETV Bharat / state

బ్రిడ్జిల ఊసే మరిచారు.. జనాలకు ఇబ్బందులు తెచ్చారు - ఏపీ వార్తలు

Incomplete Construction of Bridges: కడప నగరంలోని బుగ్గవంక సుందరీకరణలో భాగంగా బ్రిడ్జ్​లను తొలగించిన ప్రభుత్వం.. తరువాత వాటి ఊసే మరచింది. సరైన ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో.. చూట్టూ తిరిగి వెళ్లలేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. బ్రిడ్జి​లను వేగంగా నిర్మించాలని కోరుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 7, 2023, 9:24 PM IST

Incomplete Construction of Bridges: కడప నగరంలోని బుగ్గవంక సుందరీకరణలో భాగంగా రెండు అతి పురాతనమైన బ్రిడ్జిలను అధికారులు తొలగించారని అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మురాదియనగర్‌లోని పలు ప్రాంతాలను కలుపుతూ ఒకటి, నాగరాజు పేటలోని బాదుల్లా సాహెబ్ మకాన్ నుంచి పాత లా కాలేజీ వీధి వరకు మరొకటి ఉండేవి. ఈ రెండు బ్రిడ్జిలు రాకపోకలకు సౌకర్యంగా ఉండేవని.. ఇవి లేని కారణంగా ప్రజలు తీవ్రంగా కష్టాలు పడుతున్నారని అన్నారు. చూట్టూ తిరిగి రావాలంటే అధికంగా ఖర్చు అవుతోందని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా కల్లబొల్లి వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలందరూ ఆ బ్రిడ్జి కింద ఏర్పాటు చేసిన రంధ్రం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు అవసరమైన, అనువైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మొదటగా 6 కోట్లు.. బ్రిడ్జిల నిర్మాణం కోసం విడుదల చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టారు. కానీ అది ఎప్పటికీ ముందుకు కదలలేదు. దీంతో ప్రజలు నిరసన తెలియజేశారు. ఇప్పుడు కూడా మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. బ్రిడ్జిలు లేక ప్రజలు, రోజువారీ వ్యాపారాలు చేసుకోలేక వ్యాపారస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జి​లను త్వరితగతిన పూర్తి చేయాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.