గుక్కెడు తాగు నీటి కోసం ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లుతున్నారు. తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నప్పటికీ 15 రోజులుగా అవీ రావటం లేదు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలాజీ నగర్లో నెలకొంది ఈ దుస్థితి. పురపాలక నుంచి రెండు రోజులకు ఓసారి వచ్చే ట్యాంకర్, ఓ పార్టీ నాయకుడు పంపించే ట్యాంకర్ నీటితో కాలనీవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అప్పుడు అధికారులు పైప్లైన్కు మరమ్మతులు చేపట్టాక సమస్య తీరింది. ప్రస్తుతం మళ్లీ అదే సమస్య తలెత్తింది. సుమారు 50 కుటుంబాల ప్రజలు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పురపాలక అధికారులకి చెప్పినా స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో నీటిని మూడు అంతస్థులకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. తమ సమస్యను తీర్చాలని బాలాజీ నగర్ ప్రజలు స్థానిక నేతలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.
15 రోజులుగా రాని నీళ్లు... 50 కుటుంబాలకు ఇక్కట్లు
రెండు రోజులకోసారి వచ్చే వాటర్ ట్యాంకర్ వారికి తాగునీటికి ఆధారం. అది కూడా 15 రోజుల నుంచి రావటం లేదు. పైప్లైన్ మరమ్మతు చేస్తే మున్సిపాలిటీ నీరు వస్తుంది. కానీ అధికారులు పట్టించుకోవటం లేదు.
గుక్కెడు తాగు నీటి కోసం ఆ ప్రాంత ప్రజలు తల్లడిల్లుతున్నారు. తాగునీటికి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నప్పటికీ 15 రోజులుగా అవీ రావటం లేదు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బాలాజీ నగర్లో నెలకొంది ఈ దుస్థితి. పురపాలక నుంచి రెండు రోజులకు ఓసారి వచ్చే ట్యాంకర్, ఓ పార్టీ నాయకుడు పంపించే ట్యాంకర్ నీటితో కాలనీవాసులు కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అప్పుడు అధికారులు పైప్లైన్కు మరమ్మతులు చేపట్టాక సమస్య తీరింది. ప్రస్తుతం మళ్లీ అదే సమస్య తలెత్తింది. సుమారు 50 కుటుంబాల ప్రజలు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పురపాలక అధికారులకి చెప్పినా స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో నీటిని మూడు అంతస్థులకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంటున్నారు. తమ సమస్యను తీర్చాలని బాలాజీ నగర్ ప్రజలు స్థానిక నేతలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేశారు.
యాంకర్..... గుంటూరులో ప్రయాణికురాలి బ్యాగ్ ను దొంగలించిన ఆటో డ్రైవర్ నాగూర్ అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 2 లక్షల 50 వేల విలువ చేసి బంగారం నగలు స్వాధీనం చేసుకొన్నారు . ఈ నెల 3వ తేదీన రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన ఓ మహిళా కుటుంబ సభ్యులు తో కలసి రైల్యే స్టేషన్ కు బయలుదేరారు . అయితే అటుగా వచ్చిన ఆటో వారిని ఎక్కించుకుని రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లారు . రైల్వే స్టేషన్ కి వెళ్లే కంగారులో ఆటోలో బ్యాగ్ మర్చిపోయామని అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయని భాదితులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నేరస్తుడు కోసం గాలింపు చేపట్టారు. అయితే డ్రైవర్ మాత్రం తప్పించుకుని తిరుగుతూ ఈరోజు లాలాపేట పుల మార్కెట్ సెంటర్ బంగారపు వస్తువులను అమ్మే క్రమంలో సీసీఎస్ పోలీసులు అతనిని చాకచాక్యంగా అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 2 లక్షల 50 వేల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీసీఎస్ డిఎస్పీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.Body:ఫొటోస్Conclusion: