కడప జిల్లా బద్వేలులో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయి నిఖిల్ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. బద్వేల్లోని భావనారాయణ నగర్‌కు చెందిన ఈ విద్యార్థి దసరా పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. రోడ్డు దాటుతున్నప్పుడు నెల్లూరు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.
ఇదీ చదవండి:గుర్తు తెలియని వాహనం ఢీ..వ్యక్తి మృతి