కడప జిల్లా ఖాజీపేట మండలం మల్లాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన నాగులారపు ఓబులేసు దారుణ హత్యకు గురయ్యాడు. మేడపై నిద్రిస్తున్న ఓబులేసును.. గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, తగాదాలు నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: అనారోగ్యంతో శతాధిక వృద్ధుడు డాక్టర్ ఎంపీ మునిరెడ్డి కన్నుమూత