కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా, అక్రమ మద్యం స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీ రామ్ నగర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జిలకర భరత్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణా, నాటుసారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఇదీచదవండి