ETV Bharat / state

భారతావనిలో మన కీర్తి... నీట్​లో తెలుగమ్మాయిలదే హవా! - girls

ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల ప్రవేశ ఫలితాల్లో తెలుగు కీర్తి రెపరెపలాడింది. జి.మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయస్థాయిలో బాలికల కేటగిరిలో మొదటి ర్యాంకు సాధించింది. కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ఖురేషీ అస్రా 16వ ర్యాంకులో మెరిసింది. దేశవ్యాప్తంగా తొలి 20 ర్యాంకుల్లో ఐదుగురు ఆమ్మాయిలు ఉంటే... అందులో ఇద్దరు తెలుగు విద్యార్థులే కావడం విశేషం.

భారతావనిలో మన కీర్తి... నీట్​లో తెలుగమ్మాయిల హవా!
author img

By

Published : Jun 6, 2019, 5:24 AM IST

Updated : Jun 6, 2019, 7:12 AM IST

ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)-2019 ఫలితాల్లో రాజస్థాన్​కు చెందిన నళిన్ ఖండేల్ వాల్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. 720 మార్కులకు ఖండేల్ వాల్​కు 701 మార్కులు వచ్చాయి. దిల్లీకి చెందిన భవిక్ బన్సాల్, యూపీకి చెందిన అక్షిత్ కౌశిక్​లకు సమానంగా 700 మార్కులు వచ్చాయి. భవిక్ బన్సాల్​కు అక్షిత్ కౌశిక్ కన్నా జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు రావడంతో ద్వితీయ ర్యాంకు కేటాయించారు. అక్షిత్ కౌశిక్ తృతీయ ర్యాంకు పొందారు. దివ్యాంగుల అభ్యర్థుల్లో రాజస్థాన్​కు చెందిన భెరారామ్ 604 మార్కులతో టాపర్​గా నిలిచారు.

తెలుగు కీర్తి రెపరెపలు...
నీట్‌లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. తెలంగాణ విద్యార్థిని జి.మాధురి రెడ్డి 695 మార్కులతో జాతీయస్థాయిలో ఏడో ర్యాంకు సాధించగా.. బాలికల కేటగిరీలో మొదటి ర్యాంకుతో మెరిశారు. అలాగే, 690 మార్కులతో కడప జిల్లాకు చెందిన విద్యార్థిని ఖురేషీ అస్రా 16వ ర్యాంకులో నిలిచారు. నిరంతర కృషి, ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదవడం, కళాశాల యాజమాన్యం అందించిన ప్రోత్సాహం వల్లే తమకు ఈ విజయం సొంతమైందని వారు "ఈటీవీ భారత్"తో సంతోషం వ్యక్తం చేశారు.

50 శాతంపైగా అర్హత...
ఈ ఏడాది నీట్​కు 14,10,755 మంది హాజరు కాగా వారిలో 7,97,042 మంది అర్హత సాధించారు. మొత్తం 15,19,375 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ 1,08,015 మంది పరీక్షకు హాజయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో 11 భాషల్లో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షను మే5, 20వ తేదీల్లో నిర్వహించింది. జాతీయ స్థాయిలో 50 శాతానికి పైగా అర్హత సాధించగా.. రాష్ట్రస్థాయిలో 70.72 శాతం మంది అర్హత సాధించారు.

ఆంధ్రా టాపర్ ఖురేషి అస్రా...
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఖురేషి అస్రా 16వ ర్యాంకు సాధించారు. రాష్ట్రంలో ఈమెదే తొలి ర్యాంకు. విశాఖపట్నానికి చెందిన చి.భాను శివతేజ 10వ ర్యాంకు, కడపకు చెందిన సోదం శ్రీనందన్​ రెడ్డి 42, నెల్లూరు జిల్లా వాసులైన జి.కృష్ణవంశీ 62, హర్షిత్ చౌదరి 64వ ర్యాంకు దక్కించుకున్నారు. విశాఖ నగరానికి చెందిన శ్రీ శ్రేయకి 78వ ర్యాంకు లభించింది. జాతీయ స్థాయిలో తొలి 50 ర్యాంకుల్లో మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్​కు రాగా... ఇందులో రెండు ర్యాంకులు కడప జిల్లా విద్యార్థులకే వచ్చాయి.

ఇదీ చదవండీ: యుద్ధం ప్రారంభించిన 'ఆర్మీ మేజర్​ మహేశ్'

Pali (Rajasthan), Jun 05 (ANI): A minor boy in Rajasthan's Pali was beaten up by locals for allegedly molesting a girl. While speaking to ANI, a Police official said, "The boy was caught doing objectionable act with priest's daughter. A case was registered under POCSO act against him. After probe, he was sent to juvenile protection home. A viral video has come to light where locals can be seen beating him, they've been taken on remand".

Last Updated : Jun 6, 2019, 7:12 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.