ETV Bharat / state

'భవిష్యత్​లో ట్రెక్కింగ్ హబ్​గా ఎన్సీసీ 30వ ఆంధ్రా బెటాలియన్' - కడప వార్తలు

కడప నగరంలోని ఆంధ్రా బెటాలియన్ ను తిరుపతి ఎన్సీసీ గ్రూప్​ కమాండర్ కల్నల్ గంగా సతీశ్ సందర్శించారు. అక్కడ వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. 50 లక్షల రూపాయలతో చేపట్టే డ్రిల్ స్క్వేర్​ కు భూమి పూజ నిర్వహించారు.

ncc Kadapa Andhra battalion
కడప ఆంధ్రా బెటాలియన్ ను సందర్శించిన ఎన్సీసీ కల్నల్ గంగా సతీశ్
author img

By

Published : Apr 15, 2021, 9:36 PM IST

కడప నగరంలోని ఎన్సీసీ 30 వ ఆంధ్రా బెటాలియన్ భవిష్యత్తులో ట్రెక్కింగ్ హబ్​గా మారనుందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్​ కమాండర్ కల్నల్ గంగా సతీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కడపలోని ఎన్సీసీ 30 వ బెటాలియన్​ ను ఆయన సందర్శించారు. ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అక్కడి వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. వచ్చే నెల మొదటివారంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా బెటాలియన్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: భయంతో టీకాలకు దూరంగా 18వేల ఉద్యోగులు

ఈ బెటాలియన్ లో 50 లక్షల రూపాయలతో చేపట్టే డ్రిల్ స్క్వేర్​ కు కల్నల్​ భూమి పూజ చేశారు. గతంలో రెండు సార్లు జాతీయ ట్రెక్కింగ్ క్యాంపులు కడపలో నిర్వహించడంపై గంగా సతీష్​ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా గడచిన ఏడాది పాటు నుంచి ఇక్కడ క్యాంపులు చేపట్టేలదని.. త్వరలోనే మరిన్ని ట్రెక్కింగ్ క్యాంపులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సైతం మంచి ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

బద్వేల్ ఆర్టీసీ బస్ స్టాండ్​లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.