Yuvagalam Padayatra in Mydukur: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మైదుకూరు మండలం విశ్వనాథపురం విడిది కేంద్రం నుంచి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నారా లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు. భూమయ్యగారిపల్లె వరకూ 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. నారా లోకేశ్‌కు దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. చిన్నారులు, వృద్ధులు సైతం ఆయనతో కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. బాణాసంచా కాల్చుకుంటూ పూలజల్లలతో నారా లోకేశ్‌కు మైదుకూరు పట్టణంలో ఘన స్వాగతం లభించింది.
మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బహిరంగ సభకు తరలివచ్చారు. జగన్మోహన్ రెడ్డి నాగుపాము లాంటివాడని.. ఆయన కుటుంబ సభ్యులను సైతం కాటేయకుండా వదలడని నారా లోకేశ్ మండిపడ్డారు. వివేకాను ఎవరు హత్య చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న లోకేశ్.. ఎక్కడికి వెళ్లినా హూ కిల్డ్ బాబాయ్ అని ప్రశ్నిస్తున్నారన్నారు.
Lokesh fire on CM Jagan: టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో వణుకు: నారా లోకేశ్
రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయిన జగన్.. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డిని మాత్రం స్పెషల్ స్టేటస్ ఖైదీగా చూసేలా చేశారని అన్నారు. సీఎం జగన్ సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పే ధైర్యముందా అని లోకేశ్ ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే దళితులు, పేదల భూములు 100 ఎకరాల వరకూ దౌర్జన్యంగా లాక్కున్నారని లోకేశ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే.. సిట్ వేసి ఆ భూములను తిరికి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి బయట పడేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పెద్దలతో లాలూచీ ప్రయత్నాలు జరిపారని తెలిపారు. దిల్లీ మద్యం కేసులో తన సన్నిహితుడైన శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను కేసులో ఇరికించడానికి జగన్ తెర వెనక రాయబారం నడిపారని లోకేశ్ ఆరోపించారు. తనదాక వస్తే ఎవరినీ వదిలిపెట్టని జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్‌ని సైతం ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
Nara Lokesh speech: అమలాపురంలో ఉన్నా.. అమెరికా పారిపోయినా.. ఎవరినీ వదిలిపెట్టను : లోకేశ్
నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు తీవ్రమయ్యాయని.. ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేశారో.. గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయడానికి తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
"సొంత బాబాయ్ వివేకానంద రెడ్డికి ఎంత కిరాతకంగా చంపారో మనమందరం చూశాం. దాంట్లో సీబీఐ వాళ్లు.. రా అవినాష్, రా జగన్ అని పిలుస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు.. విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డిని బలి చేశాడు. అంతే కాదు 2019 ఎన్నికల్లో జగన్‌కు సహకరించిన కేసీఆర్‌కు కూడా టోపీ పెట్టాడు". - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Nara Lokesh Padayatra at Allagadda: ' బాబాయ్ హత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు'