అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రైతులు వేల ఎకరాలు ఇస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ మిగతా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి...