ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయం వద్ద మైసూర్​వారిపల్లి గ్రామస్థుల నిరసన

author img

By

Published : Mar 27, 2021, 10:06 PM IST

ఏటి పోరంబోకు స్థలాన్ని స్థానికేతరులకు కట్టబెడుతున్నారంటూ.. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూర్​వారిపల్లి గ్రామస్థులు ఆందోళన చేశారు. జనసేన మద్దతుదారు సర్పంచ్​గా గెలవడంతో.. కక్ష సాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు.

mysorevaripalli villagers agitation at tahsildar office, mysorevaripalli villagers allegations on illegal land usage
తహసీల్దార్​కి మైసూర్​వారిపల్లి గ్రామస్థుల వినతిపత్రం, తహసీల్దార్ కార్యాలయం వద్ద మైసూర్​వారిపల్లి గ్రామస్థుల ఆందోళన

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూర్​వారిపల్లి గ్రామస్థులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పంచాయతీ పరిధిలోని ఏటి పోరంబోకు స్థలాన్ని.. ప్రార్థన మందిరం పేరిట స్థానికేతరులకు రాజకీయ నాయకులు కట్టబెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. కొందరు ముస్లింలు జేసీబీలతో ఆ భూములను చదును చేస్తుండటాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా రాత్రి నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లాలో జనసేన మద్దతుతో గెలిచిన ఏకైక సర్పంచ్ మైసురువారిపల్లికి ఎన్నికైనందున.. కక్షసాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఏటి భూములను ఎవరైనా ఆక్రమిస్తే స్థానిక తహసీల్దార్ గతంలో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు.. స్థానికేతరులకు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పోలీసుల సహకారంతో అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా పెద్దఎత్తున పోలీసులను మోహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దిశ యాప్ ఉంటే.. రక్షణ వెన్నంటి ఉంటుంది: ఎస్పీ అన్బురాజన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.