కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయం నుంచి వస్తున్న లీకేజీని బుధవారం ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలు పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ శారదమ్మతో చర్చించారు. కట్ట లీకేజ్ అవుతున్నా ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేసినట్లు ఎస్‌ఈ వివరించారు. సెకన్‌కు 2.5 లీటర్లు లీకేజీ కట్ట నుంచి వస్తున్నట్లు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణంతో లీకేజీ నివారించాల్సి ఉందని ఎస్‌ఈ స్పష్టం చేశారు.
జలాశయంలో నీరు ఉండగానే పనులు చేపట్టవచ్చునని తెలిపారు. 2009లో 13 టీఎంసీలు నిల్వ చేయగా అప్పట్లో ఎక్కువగా లీకేజీ ఉండేదని.. ప్రస్తుతం తక్కువగా లీకేజీ ఉన్నట్లు తెలిపారు. రెండ్రోజుల్లో జలాశయంలో 14 టీఎంసీలకు నీరు చేరుకుంటుందని అన్నారు.
ఇదీ చదవండీ...తుంగభద్ర పుష్కరాల్లో.. పురోహితులెవరు?