క్వారంటైన్లో ఉంటున్న వారికి ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు. కడప జిల్లా వనిపెంట బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనారోగ్య సమస్యలు వస్తే వైద్యుల దృష్టికి తేవాలని అన్నారు. కేంద్రంలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఎమ్మెల్యే వెంట పురపాలక కమిషనర్ రామకృష్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఇతర అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
ఇదీ చూడండి: