ETV Bharat / state

మద్యం కోసం అప్పులు... తీర్చేందుకు చోరీలు - bikes thief arrest news

చెడు వ్యసనాలకు బానిసైన యువకుడు దొంగగా అవతారమెత్తాడు. అప్పులు చేసి మరీ మద్యం తాగిన అతను... వాటిని తీర్చేందుకు చోరీలు మొదలుపెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ద్విచక్ర వాహనాలను దోచేశాడు. చివరికి కడప జిల్లా పోలీసులకు చిక్కాడు.

Man arrested for stealing bikes
Man arrested for stealing bikes
author img

By

Published : Aug 29, 2020, 4:02 PM IST

Man arrested for stealing bikes
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్​లు

ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్న కడప జిల్లా వేంపల్లెకు చెందిన రాజు అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్​గా పని చేస్తున్న రాజు మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగడానికి అప్పులు చేసి వాటిని తీర్చడానికి దొంగతనాలు ఎంచుకున్నాడు. రాత్రిపూట ఇళ్ల ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను నకిలీ తాళం చెవితో తీసి ఎత్తుకెళ్లేవాడు. ఈ విధంగా 14 ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. ఈ వాహనాలను కడప జిల్లా వేంపల్లెతో పాటు అనంతపురం జిల్లాలోని ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల్లో చోరీ చేశాడు.

నిందితున్ని అరెస్ట్ చేసి 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అప్పులు తీర్చలేక రాజు దొంగతనాలకు పాల్పడ్డాడని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి

చితకబాదారు... శిరోముండనం చేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.