రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారు. మద్యం ధరలు అధికంగా ఉండటంతో కొంతమంది అక్రమ మార్గలు వెతుకుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుని.. వాహనాలని సీజ్ చేస్తున్నారు. వివిధ జిల్లాల్లోని చెక్ పోస్టుల వద్ద అక్రమ మద్యం సీసాలు బయటపడ్డాయి.
కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు 60 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. జమ్మలమడుగు శివారు ప్రొద్దుటూరు బైపాస్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అక్రమ మద్యం పట్టుకున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మడకశిర పోలీసుల తనిఖీల్లో 68 కర్ణాటక మద్యం పాకెట్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. కర్ణాటక మద్యం రవాణా చేసినా, అమ్మిన చట్టరీత్యా నేరమని... ఇలాంటి వాటిపై సమాచారం అందిస్తే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
గుంటూరు అర్బన్ పరిధిలో అక్రమమద్యం రవాణాపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ముమ్మరంగా దాడులు చేస్తోంది. ఇవాళ పలుచోట్ల మద్యం విక్రయిస్తున్న, రవాణా చేస్తున్నవ్యక్తులను పట్టుకుని కేసులు నమోదు చేశారు. చేబ్రోలు కారం మిల్లు ఏరియా చెక్ పోస్టు, నల్లపాడు చెక్ పోస్టువద్ద నిర్వహించిన సోదాల్లో కారు,ద్విచక్రవాహనాల్లో తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా సుమారు 4 టన్నుల ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్, ట్రైలర్ ను స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు అర్బన్ పరిధిలో అక్రమ మద్యం, ఇతర మత్తు పదార్ధాలు అమ్మకాలు జరిగినా, ఇసుక అక్రమ రవాణా జరిగినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని...ప్రజలు సహకరించా లని ఎస్ఈబీ ఏఎస్సీ కరీముల్లా షరీఫ్ కోరారు.
ఇది చదవండిశవాన్ని మూడు కిలోమీటర్లు మోసుకెళ్లారు.. ఇదే కారణం?