కడప నగరంలోని చిలుకలబావికి చెందిన ఖాదర్ బాషా... తన వద్ద ఉన్న కనకపుష్య రాగం అమ్మాలనుకున్నాడు. కర్ణాటక చెందిన వజ్రాల వ్యాపారి, ఇంకో వ్యక్తితో ఆదిత్య లాడ్జిలో బేరాన్ని కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి ఆ స్టోన్ లాగేసుకున్నారు. తర్వాత స్నానాల గదిలో బంధించారు. కొన్ని గంటల తర్వాత కట్లు విప్పుకున్నబాధితుడు... పోలీసులకు సమాచారమిచ్చాడు. గాయాలపాలైన ఖాదర్ బాషాను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి