గాలిపటాలు ఎగుర వేసేందుకని నాలుగేళ్ళ చిన్నారిని తీసుకువెళ్లిన ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆడుకొని వచ్చిన చిన్నారికి స్నానం చేయిస్తుండగా... ఈ దుర్ఘటన వెలుగు చూసింది. వెంటనే ఆ పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... 14 ఏళ్ళు, 8 ఏళ్ళు ఉన్న ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు నిత్యం వీక్షించే నిందితులు... ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి...