కరోనా బాధితులెవరూ ఆందోనళ చెందాల్సిన అవసరం లేదని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడపలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ రావటంతో ఎస్పీ అతని ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఎల్లవేళలా పోలీసు శాఖ సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం వైరస్ సోకి కోలుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడి ఇంటికి చేరుకొని అతణ్ణి పరామర్శించాడు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు వాలంటీర్లకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కరోనా సమయంలో బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.
ఇదీచదవండి