ETV Bharat / state

పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య.. అదే కారణమా..? - మునికుమార్ ఆత్మహత్య తాజా వార్తలు

Suicide: అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్ గా పనిచేస్తున్న ముని కుమార్.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని.. పలుసార్లు స్నేహితులకు చెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే ముని కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని.. రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.

suicide
పంచాయతీ కమిషనర్ ఆత్మహత్య
author img

By

Published : Jun 25, 2022, 10:24 AM IST

Suicide: అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్​గా పనిచేస్తున్న ముని కుమార్.. కడప రాయచోటి రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన మునికుమార్.. కడప నగరపాలక కార్యాలయంలో సూపరింటెండెంట్​గా విధులు నిర్వహించేవారు. మూడు నెలల కిందట.. డిప్యూటేషన్​ పై అనంతపురం పంచాయతీ కమిషనర్​ గా వెళ్లారు. వారాంతపు సెలవుల్లో ఇంటికి వచ్చేవారని కుటుంబీకులు తెలిపారు.

ఈ నేపథ్యంలో.. ముని కుమార్ శుక్ర, శనివారం సెలవు పెట్టి గురువారం కడపకు వచ్చారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. అప్పుడప్పుడు తన స్నేహితులతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో 10:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి.. రాయచోటి రైల్వే గేట్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం రైల్వే పోలీసులకు విషయం తెలియడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. పని ఒత్తిడి వల్లనే ముని కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. రైల్వే సీఐ మహమ్మద్ బాబా తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.