ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి బెంగళూరు నుంచి కడపకు బయలుదేరింది. బస్సు కడప డిపో వద్దకు రాగానే విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయగా... నాలుగు మద్యం పెట్టెలు కనిపించటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిపోకు వచ్చి డ్రైవర్ను విచారిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ కార్గోలో కూడా మద్యం తీసుకొచ్చిన విషయం మరువకముందే... ఏకంగా అక్రమ మద్యం తీసుకొని రావడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: