కడప జిల్లా ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలో రెండవ రోజు అడ్మిషన్లు ముగిశాయి. మొదటి విడతగా మొత్తం వెయ్యిమందికి గాను 966 హజరుకాగా, రెండోరోజు 468 మంది గాను 451 విద్యార్థులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులు కోటి ఆశలతో కళాశాలలో చేరారని ఆర్ జీ కె యు టి డైరెక్టర్ సుదర్శన్ రావు తెలిపారు.
ఇవీ చదవండి