కడప జిల్లాకు రూ.40 లక్షల విలువగల 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిచిన ఐసీఎల్ (ఎర్రగుంట్ల, చిలమకూరు యూనిట్లు) కంపెనీ వారి దాతృత్వం అభినందనీయం అని.. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. సంస్థ ప్రతినిధులు అందిన కాన్సంట్రేటర్లను జిల్లాలో అవసరమైన ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇందులో రూ.35 లక్షలతో 5 లీటర్స్/ మినిట్ సామర్థ్యంతో.. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను, రూ.5 లక్షలతో సిలిండర్లకు నేరుగా కనెక్ట్ చేసుకుని ఆక్సిజన్ తీసుకునేందుకు అవసరమైన ఫ్లో మీటర్లు, రెగ్యులేటర్లు, హ్యూమిడీఫయర్లు వంటివి 200 యంత్రాలు ఉన్నాయన్నారు. కడపను కొవిడ్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: