న్యాయమూర్తులు ఒకటికి రెండుసార్లు విచారించి సరైన తీర్పు ఇవ్వాలని హైకోర్టు జడ్జి జస్టిస్ రంగారావు అన్నారు. కడప కోర్టు ఆవరణలో జిల్లాలోని న్యాయమూర్తులకు శిక్షణా తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ప్రజలకు న్యాయవ్యవస్థపై ఎంతో గౌరవం ఉందనీ.. సామాన్యులకు సైతం న్యాయం అందుబాటులో ఉండాలని సూచించారు. లోక్ అదాలత్‌లను సద్వినియోగపరుచుకుని బాధితులకు సకాలంలో న్యాయం అందజేయాలన్నారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటి.. న్యాయస్థానం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఇవీ చదవండి..