ETV Bharat / state

పెన్నాకు భారీ వరద... కడప జిల్లా రైతుల్లో ఆందోళన - water flow

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కడప జిల్లాలోని పెన్నా నది ప్రవాహం క్షణక్షణానికి పెరుగుతోంది. ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఇన్ ఫ్లో లక్షా 11 వేల క్యూసెక్కులకు చేరింది.

అంతకంతకూ పెరుగుతున్న పెన్నా నీటి ప్రవాహం
author img

By

Published : Sep 17, 2019, 6:12 PM IST

అంతకంతకూ పెరుగుతున్న పెన్నా నీటి ప్రవాహం

కడప జిల్లా పరిధిలో ప్రవహిస్తున్న పెన్నా నదిలో గణనీయంగా నీటి ప్రవాహం పెరిగింది. వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద సోమవారం ఉదయం 21 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా మంగళవారం సాయంత్రానికి లక్షా 11 వేల క్యూసెక్కులకు చేరుకుంది. 36 గంటల్లోనే 90 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు నుంచి వస్తున్న నీటితోపాటు కర్నూలు, కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కుందూ నదిలో ప్రవహిస్తున్న నీరు పెన్నాకి చేరుతోంది. ఈ నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంతంలో వరి, పసుపు, అరటి పంటలు సాగు చేయగా... వరద నీటి చేరికతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి

రెండు కళ్లు.. రెండు కళ్లు.. జలపాతాల వైపు లాగేస్తున్నాయే!

Intro:కొనసాగుతున్న గాలింపు. బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్, బొట్లపై బలగాలు గోదావరి నదిలో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి.

Body:మధ్యాహ్నం 1.30 కు దేవిపట్నం వద్ద హెలికాఫ్టర్ తో గాలింపు దృశ్యాలు.

Conclusion:8008622066

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.