కడపలో గోపాలమిత్రలు గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో సహాయకులుగా ఉంచాలని కోరుతూ గిన్నె పట్టుకుని భిక్షాటన చేశారు. 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న గోపాలమిత్రులకు ప్రభుత్వం మొండిచేయి చూపడం తగదని గోపాలమిత్ర సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేసారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని కార్యక్రమాల్లో సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఆత్మహాత్యలు తప్పవన్నారు.
ఇదీచూడండి.ఆపరేషన్ కశ్మీర్: ఏంటీ ఆర్టికల్ 35-ఎ?