కడప జిల్లా కమలాపురం మండలం పెద్దపల్లి శివాలయంలో నందిపై ఉన్న శివపార్వతుల ఏకశిలా విగ్రహం చోరీకి గురయింది. వజ్రాలు ఉంటాయనే ఆశతో దొంగలించి ఉండొచ్చని ఆలయ ఛైర్మన్ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆరో శతాబ్దం నాటి ఈ విగ్రహం గురించి చరిత్రలో కడప జిల్లా కైఫీయతు ఒకటో పేజీలో రాశారని ఆలయ ఛైర్మన్ శివరామిరెడ్డి తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.
ఇదీ చూడండి