ETV Bharat / state

జిల్లాలో నత్తనడకన సీసీఆర్‌సీ పత్రాల పంపిణీ - కడపలో కౌలు దారు పరిస్థితి

కడప జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఖరీఫ్‌ ప్రారంభం అవడంతో సాగుకు బ్యాంకుల నుంచి పంట రుణాలు దక్కక నిరీక్షిస్తున్నారు. మరోవైపు రైతు భరోసా పథకం వర్తించక నిట్టూరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా తీసుకొచ్చిన పంట సాగు హక్కుదారుల చట్టం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావటంలేదు. దీంతో కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

farmers problem
farmers problem
author img

By

Published : Jun 26, 2020, 12:02 PM IST

గత ఏడాది కౌలు రైతులకు ఇచ్చిన పంట సాగు హక్కు ధ్రువీకరణ పత్రాల (సీసీఆర్‌సీ) గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు వాటిని పునరుద్ధరించే ప్రక్రియ కడప జిల్లాలో వేగంగా సాగటంలేదు. దీనికితోడు కొత్తగా సీసీఆర్‌సీ కార్డుల జారీ మొదలుకాకపోవడం కౌలు రైతుల పాలిట శాపంగా మారింది. కౌలు రైతుల వద్ద సీసీఆర్‌సీ పత్రాలుంటేనే బ్యాంకుల నుంచి పంట రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రైతు భరోసా దక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు(ఎల్‌ఈసీ) జారీచేసి బ్యాంకుల నుంచి పంట రుణాలు మంజూరయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇదీ పరిస్థితి ..

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కౌలుదారులకు కూడా రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కౌలు రైతులందరికీ ప్రభుత్వ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో పంట సాగు హక్కుదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. జిల్లాలో పలు కారణాలతో ఇది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోవడంతో కౌలు రైతులు నష్టపోతున్నారు. గతేడాది కౌలు రైతులకు సీసీఆర్‌సీ పత్రాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం గ్రామసభలు నిర్వహించింది. గతేడాది అక్టోబరు 2 నుంచి జిల్లాలో సీసీఆర్‌సీ పత్రాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 6,300 మంది కౌలు రైతులకు మాత్రమే వీటిని మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గతేడాది రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2337 మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్కొక్కరికి రూ.13,500 చొప్పున మంజూరైంది.

గత ఏడాది (2019-2020)లో సీసీఆర్‌సీ పత్రాలున్న 221 మంది కౌలు రైతులు బ్యాంకుల నుంచి రూ.10.24 కోట్ల రుణం పొందినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడు అధికారులు గ్రామసభలు నిర్వహించినా చాలా మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ పత్రాలు మంజూరు చేయలేదు. దీనికి భూ యజమానుల్లో అవగాహన లోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 1,06,846 హెక్టార్లలో పంటలు సాగు చేయించేందుకు వ్యవసాయాధికారులు ప్రణాళిక రూపొందించారు. అయినా ఇప్పటికీ సీసీఆర్‌సీ పత్రాల జారీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కౌలు రైతులందరికీ సీసీఆర్‌సీ పత్రాలు మంజూరు చేసేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాధాదేవితో మాట్లాడగా గతేడాది జారీ చేసిన సీసీఆర్‌సీ పత్రాల గడువు ఇంకా ముగియలేదన్నారు. ఈ ఏడాది కొత్తవాటి జారీ రెవెన్యూ శాఖ పర్యవేక్షణలో జరుగుతోందని ఆమె వెల్లడించారు. దీని గురించి జిల్లా సంయుక్త పాలనాధికారి గౌతమితో మాట్లాడగా ఈ ఏడాది సీసీఆర్‌సీ పత్రాల జారీ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఎవరికైనా ఇబ్బందులుంటే పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

గతేడాది కౌలు కార్డు రాలేదు

నేను 3 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశా. గతేడాది కౌలు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదు. భూ యజమాని అంగీకారం తెలపకపోవడంతో మంజూరు చేయలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ విషయంలో భూ యజమానులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈసారైనా నాకు కౌలు కార్డు అందించాలని అధికారులను కోరుతున్నా. - రాంభూపాల్‌రెడ్డి, నక్కవానిపల్లె గ్రామం, మైలవరం మండలం

ప్రభుత్వ లబ్ధి అందేలా చూడాలి

నేను 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా. కౌలు కార్డు అందిస్తే రుణాలు తీసుకునేందుకు, రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి అర్హులైన వారికి సీసీఆర్‌సీ పత్రాలు మంజూరు చేయాలి.- పిల్లి నాగరాజు, గంగుల నారాయణపల్లె, మైలవరం మండలం

ఇదీ చవదండి: నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.