కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఒంటిమిద్దె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ముర్రా లక్ష్మిరెడ్డి (81) అనే రైతు పొలం పనులకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని... అడ్డున్న చెట్ల కొమ్మలు తొలగించాలని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా స్పందించలేదని స్థానికులు వాపోయారు. మృతి చెందిన లక్ష్మారెడ్డికి భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీచదవండి