కడప జిల్లా ఎర్రగుంట్ల వద్దనున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. డిమాండ్ లేని కారణంగా ఉత్పత్తి నిలిపివేశామని అధికారులు అంటున్నారు. లాక్ డౌన్ కాలంలో కేవలం ఒక యూనిట్లోనే 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తి నిలిచి పోవటంతో భవిష్యత్తుపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశామని ఆర్టీపీపీ అధికారులు చెబుతున్నారు. కానీ గత కొంత కాలంగా ఆర్టీపీపీని, ఎన్టీపీసీలో విలీనం చేస్తారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పటికే కొన్నిసార్లు ఎన్టీపీసీ అధికారులు ఆర్టీపీపీకి వచ్చి పరిశీలించి వెళ్లారు. అందులో భాగంగానే కావాలనే విద్యుత్ ఉత్పత్తి నిలిపేసి... డిమాండ్ లేదనే కారణం చెబుతున్నట్లు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.