కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కడప ప్రజలు కర్ఫ్యూని స్వచ్ఛందంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ని మూసివేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. అత్యవసరమయితే తప్పా ఎవరూ రోడ్లపై కనిపించ లేదు. బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 800 బస్సు సర్వీసులు నిలిపివేశారు.
ఇదీ చదవండి: కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల.. రాష్ట్రంలో ఐదుగురికి పాజిటివ్