ETV Bharat / state

నీటిప్రాజెక్టులపై సీబీఐ విచారణ చేపట్టాలి: డీఎల్

తెదేపా హయంలో నీటిప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచి... నేతలు అవినీతికి పాల్పడ్డారని వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం... నీటిప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి మీడియా సమావేశం
author img

By

Published : Jun 7, 2019, 7:03 PM IST

వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి మీడియా సమావేశం

గత ప్రభుత్వంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని వైకాపా నేత డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. వాటిపై ప్రస్తుత ప్రభుత్వం సీబీఐతో విచారణ చేయించాలని చెప్పారు. కడప ప్రెస్ క్లబ్​లో విలేకరులతో మాట్లాడిన ఆయన... ఎన్నికల ఫలితాలు చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు.

గతంలో జగన్​ను తాను విమర్శించిన విషయాన్ని ప్రస్తావించారు. అవేవి మనసులో పెట్టుకోకుండా తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తుచేశారు. అవినీతిలేని పాలన అందించడానికి జగన్ కృషి చేస్తోన్నారని డీఎల్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో ఆర్థిక మంత్రి ఎల్​ఓసీ పత్రాలు ఇవ్వడానికి 3 శాతం కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో...ప్రస్తుత ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు.

ఆప్కో సంస్థలోనూ కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న రవీంద్రారెడ్డి... సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏ పదవులు ఆశించకుండానే వైకాపాలో చేరానని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..?

Intro:Ap_Vsp_105_07_Bhari_Chori_Vicharana_Ab_C16
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిది నీళ్లకుండీల కూడలిలోలో గత మధ్యాహ్నం పి. నారాయణ మూర్తి కి చెందిన ఇంట్లో 60 తులాల బంగారం 5 కిలోల వెండి తో పాటు 5 లక్షల నగదు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన న విషయం విధితమే.ఈ ఈ నేపథ్యంలో లో విశాఖ నార్త్ జోన్ క్రైమ్ సి ఐ జి. గోవిందరావు సిసిఎస్ -సి ఐ రవి ప్రసాద్ విచారణ చేపట్టారు. ఆనందపురం -పెందుర్తి రహదారి లో లో రహదారిని ఆనుకుని ఉన్న ఇంటిలోనే పట్టపగలు భారీ చోరీ జరిగింది. బాధితులు నగరంలోని వివిధ పనుల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది

Conclusion:చోరీ సంఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో ఉన్న వారిని విచారణ చేస్తున్నారు
బైట్: జి గోవిందరావు నార్త్ జోన్ క్రైమ్ సి ఐ విశాఖపట్నం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.