వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం బెస్త వేముల గ్రామంలో పంట బీమా వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సిమెంట్ కంపెనీకి చెందిన దాదాపు 51 ఎకరాల భూమిని ఈ క్రాఫ్‌లో నమోదు చేశారని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. సాగులో లేని భూమికి పంట బీమా సైతం మంజూరైందని.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
విషయం 'ఈనాడు' దినపత్రికలో ప్రచురితం కావటంతో జమ్మలమడుగు ఆర్డీవో గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 51 ఎకరాలకు పంట బీమా మంజూరు అయినట్లు తమ విచారణలో తేలిందన్నారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి మంజూరైన నగదును నిలుపుదల చేశామన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి :