కడప జిల్లాలో కరోనా వ్యాధి పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరిస్తోంది. బద్వేలు పట్టణం నుంచి గొడుగునూరు గ్రామానికి ఈ వ్యాధి విస్తరించింది. చెన్నై నుంచి వచ్చిన దంపతుల్లో.. భార్యకు కరోనా సోకినట్టు అధికారులు నిర్ధరించారు. ఈమె కుటుంబ సభ్యులతో పాటు 20 మందిని వైద్య పరీక్షల నిమిత్తం కడపకు పంపించారు. మరో 40 మందిని ఆమె కలిసినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.
బాధితురాలు.. తన సొంత గ్రామంతో పాటు బద్వేలు పట్టణ ప్రాంతాలకూ వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంగా గ్రామంలో రాకపోకలు నిలిపివేశారు. గ్రామస్థులంతా లాక్డౌన్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో గతంలో నలుగురికి కరోనా సోకగా.. వారంతా కోలుకున్నారు. తాజాగా 5వ కేసు నమోదు కావడంపై ప్రజల్లో భయాందోళన నెలకొంది.
ఇదీ చదవండి: